Prabhas: ప్రభాస్ ‘ఫౌజీ’లో ఇద్దరా..?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం తన నెక్స్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తరువాత తన నెక్స్ట్ మూవీని దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో చేయనున్నాడు ఈ స్టార్ హీరో. అయితే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి సినీ సర్కిల్స్‌లో ఓ ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తుంది.

‘ఫౌజీ’ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా ఇమాన్విని ఇప్పటికే పరిచయం చేశారు మేకర్స్. అయితే, తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉంటుందని, ఆమె పాత్ర కూడా చాలా కీలకంగా ఉండబోతుందని తెలుస్తోంది. కాగా రెండో హీరోయిన్ ఎంపిక కూడా జరిగిపోయిందని, సరైన సందర్భం చూసి ఆమెను మేకర్స్ రివీల్ చేస్తారనే టాక్ జోరుగా వినిపిస్తోంది.

మరి నిజంగానే ప్రభాస్ ‘ఫౌజీ’లో ఇద్దరు హీరోయిన్లు నటిస్తున్నారా.. నిజంగానే రెండో హీరోయిన్ ఎంపిక కూడా పూర్తయిందా అనేది తెలియాలంటే అఫీషియల్ ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version