క్రేజీ కాంబో.. విశ్వక్‌తో నాని హీరోయిన్..?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే ‘మెకానిక్ రాకీ’ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ యంగ్ హీరో.. ఆ తరువాత కూడా పలు ఇంట్రెస్టింగ్ చిత్రాలను లైన్‌లో పెట్టాడు. ఇందులో ‘జాతిరత్నాలు’ డైరెక్టర్ అనుదీప్‌తో ఓ సినిమా కూడా ఉంది. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

ఇక ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ వార్త వినిపిస్తోంది. ఈ సినిమాలో అందాల భామ ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించబోతుందని తెలుస్తోంది. ప్రియాంక ఇటీవల న్యాచురల్ స్టార్ నాని సరసన ‘సరిపోదా శనివారం’ మూవీలో నటించి బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.

దీంతో, ఇప్పుడు ఆమె విశ్వక్ సేన్ సరసన నటించనుందనే టాక్ ప్రస్తుతం జోరుగా వినిపిస్తుండటంతో అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. అయితే, దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version