Pushpa 2: పుష్ప-2 హిందీ రైట్స్.. రెండింతలా..?

Pushpa 2: పుష్ప-2 హిందీ రైట్స్.. రెండింతలా..?

Published on Oct 4, 2024 3:01 AM IST

టాలీవుడ్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ ప్రస్తుతం చివరిదశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ అత్యంత గ్రాండియర్‌గా రూపొందిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ అందుకున్న భారీ విజయానికి ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు.

కాగా, ఈ సారి ‘పుష్ప-2’ మూవీపై ఉత్తరాదిన కూడా భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమా కోసం హిందీ బెల్ట్‌లో తీవ్ర పోటీ నెలకొంది. తాజాగా పుష్ప-2 చిత్రానికి సంబంధించిన హిందీ రైట్స్‌ను మేకర్స్ అత్యంత భారీ ధరకు అమ్మినట్లుగా సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పుష్ప తొలి భాగానికి ఇది రెండింతల రేటుగా వార్తలు వస్తున్నాయి.

దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు ‘పుష్ప-2’ మూవీపై నార్త్ ఆడియెన్స్ ఏ రేంజ్‌లో ఆసక్తిగా ఉన్నారనేది. ఇక తన యాక్టింగ్‌తో ఏకంగా నేషనల్ అవార్డ్ అందుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, పుష్ప-2 మూవీతో మరోసారి నేషన్‌వైడ్‌గా ట్రెండ్ సెట్టర్ అవుతాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 6న వరల్డ్‌వైడ్ రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు