మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన రీసెంట్ మూవీ ‘మట్కా’ భారీ అంచనాల మధ్య ఇటీవల రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు కరుణ కుమార్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో వరుణ్ తేజ్ కెరీర్లో మరో ఫ్లాప్ చేరింది.
ఇక ఈ మూవీ రిజల్ట్‌ని పక్కనబెట్టిన వరుణ్ ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే, ఈ సందర్భంగా ఆయన రెమ్యునరేషన్ విషయంలో సినీ సర్కిల్స్‌లో తాజాగా ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది. గతకొంత కాలంగా వరుస ఫ్లాపులు అందుకుంటున్న వరుణ్ తేజ్, తన రెమ్యునరేషన్ విషయంలో మాత్రం ఎలాంటి వెనకడుగు వేయడం లేదని.. ఆయన ఒక్కో సినిమాకు రూ.7 కోట్ల ఛార్జ్ చేస్తున్నారని తెలుస్తోంది.
వరుణ్ తేజ్ ప్రస్తుతం మరో రెండు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడని.. ప్రస్తుతం ఇవి ప్రీ-ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాయని తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలకు కూడా వరుణ్ తేజ్ రెమ్యూనరేషన్ తగ్గించడం లేదని తెలుస్తోంది.