తమిళ వెర్సటైల్ యాక్టర్ విజయ్ సేతుపతి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెట్రీమారన్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘విడుదల 2’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలోని రస్టిక్ స్టోరి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక వెట్రిమారన్ మార్క్ కథనం ఈ సినిమాకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ఇక తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 ‘విడుదల 2’ చిత్ర ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్‌ను దక్కించుకుంది. అయితే, ఇప్పుడు ఈ చిత్రాన్ని జనవరి 17 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేయాలని జీ5 ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని ఒకేరోజున ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చేందుకు జీ5 సిద్ధమవుతోందట. సంక్రాంతి సినిమాల హడావుడి పూర్తవగానే ఓటీటీలో ఈ సినిమా సందడి చేసేందుకు సిద్ధమవుతోంది.
ఇక ఈ సినిమాలో మంజూ వారియర్ హీరోయిన్‌గా నటించగా సూరి, గౌతమ్ వాసుదేవ్ మీనన్, భవాని శ్రీ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. మరి ఈ సినిమాను నిజంగానే జనవరి 17న ఓటీటీ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తారా లేదా అనేది చూడాలి.