వెంకటేష్ కోసం నిర్మాతగా యంగ్ హీరో..?

టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామలు మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే, ఇప్పుడు వెంకటేష్ ఓ తమిళ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడనే వార్తలు సినీ సర్కిల్స్‌లో వార్తలు వినిపిస్తున్నాయి.

తమిళ దర్శకుడు టిఎన్.సంతోష్ డైరెక్షన్‌లో త్వరలోనే ఓ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలో వెంకటేష్‌ని హీరోగా తీసుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే వెంకీకి ఈ సినిమా కథను వినిపించారట. అయితే, ఈ సినిమా కథ నచ్చిన యంగ్ హీరో నితిన్ తన హోం బ్యానర్ శ్రేష్ఠ్ మూవీస్‌పై ప్రొడ్యూస్ చేసేందుకు ముందుకొచ్చారట. ఇక ఈ సినిమాలో యంగ్ బ్యూటీ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు తెలుస్తోంది.

అయితే, ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ కాప్‌గా వెంకటేష్ నటించబోతున్నాడట. కానీ, ఆయన ఈ సినిమాకు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని, ఆయన ఓకే చెప్పిన తరువాత ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ సినిమాకు వెంకీ ఓకే చెబుతాడా లేదా అనేది వేచి చూడాలి.

Exit mobile version