బజ్ : నాగచైతన్య నెక్స్ట్ లో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ ?

బజ్ : నాగచైతన్య నెక్స్ట్ లో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ ?

Published on Apr 2, 2024 2:00 AM IST

యువ నటుడు అక్కినేని నాగచైతన్య తాజాగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ తండేల్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.

త్వరలో రిలీజ్ కి రెడీ అవుతున్న ఈ మూవీ అనంతరం ఇటీవల విరూపాక్ష మూవీతో మంచి విజయం అందుకున్న కార్తీక్ దండు తో నాగచైతన్య తన నెక్స్ట్ మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఆకట్టుకునే కథ, కథనాలతో రూపొందనున్న ఈ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ త్వరలో రానుండగా ఇందులో నాగచైతన్యకి జోడీగా పూజా హెగ్డే నటించనున్నట్లు లేటెస్ట్ టాలీవుడ్ బజ్. గతంలో వీరిద్దరూ కలిసి ఒక లైలా కోసం మూవీలో నటించారు. విజయ్ కుమార్ కొండా తెరకెక్కించిన ఆ మూవీ అప్పట్లో విజయం అందుకుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు