టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన మాస్ మహారాజా తాజాగా టైగర్ నాగేశ్వరరావు మూవీతో ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి సక్సెస్ సొంతం చేసుకున్నారు. ఇక ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేనితో ఈగిల్ మూవీ చేస్తున్నారు రవితేజ. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. మరోవైపు అతి త్వరలో మాస్ కమర్షియల్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ తో మాస్ మహారాజా ఒక మూవీ చేయనున్నారు అనే వార్తలు కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఇక విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ బజ్ ప్రకారం ఇటీవల జాతిరత్నాలు, ప్రిన్స్ సినిమాలతో మంచి సక్సెస్ లు సొంతం చేసుకున్న టాలెంటడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కెవి తో అతి త్వరలో రవితేజ ఒక మూవీ చేసేందుకు సిద్ధం అయినట్లు చెప్తున్నారు. ఇటీవల రవితేజకు ఒక స్టోరీ లైన్ వినిపించిన అనుదీప్, అది ఆయనకు నచ్చడంతో ప్రస్తుతం దానిని పూర్తి స్క్రిప్ట్ గా డెవలప్ చేస్తున్నారట. అతి త్వరలో ఈ క్రేజీ ప్రాజక్ట్ పట్టాలెక్కనుండగా దీనికి సంబందించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.