రేపు “భారతీయుడు 2” నుండి క్యాలెండర్ సాంగ్ రిలీజ్!

రేపు “భారతీయుడు 2” నుండి క్యాలెండర్ సాంగ్ రిలీజ్!

Published on Jun 30, 2024 9:56 PM IST

యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఇండియన్ 2. తెలుగులో భారతీయుడు 2 గా జూలై 12, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్లలోకి రానుంది. రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం నుండి ట్రైలర్ ను విడుదల చేయగా, మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

ఈ చిత్రం నుండి మరో ఇంట్రెస్టింగ్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసేందుకు రెడీ అయిపోయారు. క్యాలెండర్ సాంగ్ ను రేపు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇదే విషయాన్ని వెల్లడించడానికి సరికొత్త పోస్టర్ ను విడుదల చేసారు. పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రియా భవానీ, రకుల్ ప్రీత్ సింగ్, బాబీ సింహా, SJ సూర్య, సముద్రఖని, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ మరియు రెడ్ జెయింట్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు