టాలీవుడ్లో పండుగ సీజన్లో తమ సినిమాలను రిలీజ్ చేస్తే బ్లాక్‌బస్టర్ హిట్ అవుతాయని దర్శకనిర్మాతలు భావిస్తుంటారు. ఈ క్రమంలోనే సంక్రాంతి బరిలో పలు క్రేజీ సినిమాలను రిలీజ్ చేసి సక్సెస్ అందుకోవాలని నిర్మాతలు ప్రయత్నిస్తుంటారు. ఇక స్టార్ ప్రొడ్యూసర్స్ అయితే, వీలైనన్ని ఎక్కవ థియేటర్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తారు. అయితే, ఒక పండుగకు రెండు సినిమాలను రిలీజ్ చేసిన నిర్మాతలు చాలా అరుదుగా ఉన్నారు.
టాలీవుడ్లో గతంలో మైత్రీ మూవీ మేకర్స్ వారు సంక్రాంతి కానుకగా రెండు సినిమాలను రిలీజ్ చేశారు. అయితే విశేషమేమిటంటే.. వారు రిలీజ్ చేసిన రెండు సినిమాలు కూడా బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి. 2023లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’.. నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి. ఈ రెండు సినిమాలను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు. అయితే, ఇప్పుడు ఇలాంటి ఫీట్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు చేయబోతున్నారు.
2025 సంక్రాంతి బరిలో దిల్ రాజు ప్రెస్టీజియస్‌గా ప్రొడ్యూస్ చేస్తున్న ‘గేమ్ ఛేంజర్’ రిలీజ్ కానుంది. ఈ సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. ఈ సినిమాతో పాటు ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ కూడా రిలీజ్ కానుంది. మరి ఈ రెండు సినిమాలు విజయాలను అందుకుని మైత్రీ వారి ఫీట్‌ను రిపీట్ చేయగలవా..? అనేది ఆసక్తికరంగా మారింది.