తారక్ లానే పవన్ కు సాలిడ్ వెల్కమ్ అందిస్తారా.?

Published on Jan 13, 2021 7:03 am IST

మన టాలీవుడ్ అగ్ర హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లు కూడా ఒకరు. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ ఇద్దరు హీరోల నుంచి తమ అభిమానులకు తమ లేటెస్ట్ సినిమాల్తో గట్టి పరీక్షనే పెట్టారు. తమ లాస్ట్ సినిమాలు ఎప్పుడో 2018లో పడ్డాయి. అక్కడ నుంచి తమ అభిమానులకు నిరీక్షణ తప్పలేదు.

అందుకే ఆ గ్యాప్ ను ఓ సాలిడ్ అప్డేట్ తోనే తిరిగిచ్చేయాలని ఫిక్స్ అయ్యిపోయారు. మరి అలాగే తారక్ చేసిన “RRR” నుంచి భీం టీజర్ తో తెలుగులో సరికొత్త లెక్కలనే సెట్ చేసి సంచలనం రేపారు. దానితో తారక్ క్రేజ్ మరోసారి ప్రూవ్ అయ్యింది. మరి అలాగే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” టీజర్ విషయంలో అభిమానులు గట్టి ప్లానింగులే చేస్తున్నారు.

శ్రీరామ్ వేణు తెరకెక్కించిన ఈ చిత్రం కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ అవైటెడ్ టీజర్ కు పవన్ అభిమానులు ఎలాంటి రేంజ్ వెల్కమ్ అందిస్తారో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More