ప్రపంచ ప్రఖ్యాత ఫెస్టివల్ కి కరోనా సెగ.

ప్రపంచ ప్రఖ్యాత ఫెస్టివల్ కి కరోనా సెగ.

Published on Mar 20, 2020 10:18 AM IST

కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూ పోతుంది. ఉహించినదానికి మించిన నష్టం ఈ నూతన వైరస్ కారణంగా సంభవించేలా కనిపిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని పరిశ్రమలు కుదేలవుతున్నాయి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. ప్రభుత్వ నిబంధనల కారణంగా నూతన చిత్రాల విడుదల ఆగిపోగా, షూటింగ్స్ కి సైతం బంధ్ ప్రకటించారు. ఇక విడుదలైన సినిమాలను థియేటర్స్ కి వెళ్లి చూసే నాధుడే లేడు. కొరోనా వైరస్ కారణంగా ప్రఖ్యాత వరల్డ్ మూవీ ఫెస్టివల్ వాయిదాపడింది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోయిన్స్ మరియు హీరోలు సినీ ప్రముఖులు పాల్గొనే కేన్స్ ఫెస్టివల్ వాయిదా వేసినట్లు సమాచారం. ఫ్రాన్స్ దేశంలోని కేన్స్ నగరంలో ఏటా జరిగే ఈ సినిమా ఫెస్టివల్ కి ఘన చరిత్ర ఉంది. తారలు అలాగే సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొనడం ఓ గౌరవంగా భావిస్తారు. కలర్ ఫుల్ అండ్ గ్లామర్ వేడుకగా పేరున్న కేన్స్ ఫెస్టివల్ కొరోనా కారణంగా వాయిదాపడింది. మే లో జరగాల్సిన ఈ వేడుకను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు