‘కెప్టెన్ మిల్లర్’ పెయిడ్ ప్రీమియర్స్ డీటెయిల్స్

‘కెప్టెన్ మిల్లర్’ పెయిడ్ ప్రీమియర్స్ డీటెయిల్స్

Published on Jan 23, 2024 11:08 PM IST

కోలీవుడ్ స్టార్ నటుడు ధనుష్ హీరోగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా యువ దర్శకుడు అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కెప్టెన్ మిల్లర్. ఈ మూవీని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.

శివరాజ్ కుమార్, సందీప్ కిషన్ కీలక పాత్రలు పోషించిన కెప్టెన్ మిల్లర్ ఇప్పటికే తమిళ ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. విషయం ఏమిటంటే జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా రిలీజ్ కానున్న ఈ మూవీ యొక్క పెయిడ్ ప్రీమియర్స్ ని జనవరి 25న ఏపీ తెలంగాణ లో సెలెక్ట్ చేసిన కొన్ని థియేటర్స్ లో ప్రదర్శించనున్నట్లు మేకర్స్ కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. మరి తెలుగులో ఈ మూవీ ఎంత మేర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు