‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు వర్షన్ రన్ టైం లాక్

‘కెప్టెన్ మిల్లర్’ తెలుగు వర్షన్ రన్ టైం లాక్

Published on Jan 21, 2024 3:00 AM IST


కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా యువ దర్శకుడు అరుణ్ మతేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ కెప్టెన్ మిల్లర్. సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ గ్రాండ్ లెవెల్లో నిర్మించిన ఈ మూవీ ఇటీవల తమిళ ఆడియన్స్ ముందుకి వచ్చి సక్సెస్ టాక్ తో కొనసాగుతోంది. ఇక ఈమూవీని జనవరి 25న తెలుగు ఆడియన్స్ ముందుకి తీసుకురానున్నారు. తాజాగా ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ రన్ టైం లాక్ అయింది.

కాగా ఈ మూవీ 2 గం. 29 ని. ల పాటు సాగనుంది. అయితే విషయం ఏమిటంటే, తాజాగా తెలుగు వర్షన్ యొక్క రన్ టైం 2 గం. 37 ని. లుగా ఉంది. దీనిని బట్టి తెలుగు వర్షన్ లో 8 నిమిషాల పాటు తేడా గమనించవచ్చు. ఇక్కడి ఆడియన్స్ ప్రకారం కొన్ని సీన్స్ ఎడిట్ చేసినట్లు తెలుస్తోంది. కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, తెలుగు యువ నటుడు సందీప్ కిషన్ కీలక పాత్రలు చేసిన ఈ మూవీకి జివి ప్రకాష్ సంగీతం అందించారు. మరి తెలుగులో కెప్టెన్ మిల్లర్ ఏ స్థాయి సక్సెస్ సొంతం చేసుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు