ఈ పాటను ఆస్వాదించండి – ఏఆర్ రెహ్మాన్

భారత జట్టు టీ20 వరల్డ్ కప్ గెలవడంతో భారత్ విజయాన్ని సినీ ప్రముఖులు కూడా భారీగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే టీ20 వరల్డ్ కప్‌లో భారత్ విజయాన్ని తాను కూడా బాగా సెలబ్రేట్ చేసుకున్నట్లు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ తన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. పైగా తమ ‘టీమ్ ఇండియా హై హమ్’ సాంగ్‌‌‌ ప్రదర్శనను ఆస్వాదించాలని ‘మైదాన్’ సినిమాలోని పాటను కూడా ఏఆర్ రెహ్మాన్ షేర్ చేయడం విశేషం.

తన టీమ్‌తో కలిసి ప్రదర్శన చేసిన వీడియోను ఈ సందర్భంగా ఏఆర్ రెహ్మాన్ పంచుకున్నారు. కాగా అజయ్ దేవగణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మైదాన్’ సినిమాలోని ఈ పాట ఆటగాళ్లలో జోష్ నింపేలా ఉంది. ఇక ’టీమ్ ఇండియా‘ విజయంతో సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పాజిటివ్ పోస్ట్ లు పెట్టి వైరల్ చేశారు. కొందరు సినీ రాజకీయ ప్రముఖులు కూడా టీ20 వరల్డ్ కప్ విజయం పై స్పందిస్తూ అభినందనలు తెలిపిన సంగతి తెలిసిందే.

Exit mobile version