అరకు మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు కొత్తపల్లి గీత, పరుచూరి రామకోటేశ్వరరావు దంపతుల తనయుడు అభినయ్ తేజ్ వివాహం మాధవి, కోటపాటి సీతారామరావు గారి పుత్రిక అక్షతతో ఘనంగా జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్‌లో జరిగిన ఈ వేడుకకు కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.
అభియన్ తేజ్, అక్షత వివాహ వేడుకలో అతిథులుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్, ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్, రుడా(రాజమండ్రి అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ) ఛైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ పురంధేశ్వరి, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, జీసీసీ ఛైర్మన్ శ్రవణ్ కుమార్, బీజేపీ నాయకులు లక్ష్మణ్, మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రచయిత, ఎంపీ విజయేంద్రప్రసాద్, యాక్టర్స్ వడ్డే నవీన్, తరుణ్, శ్రీకాంత్, నవీన్ చంద్ర, శివ బాలాజీ, డైరెక్టర్స్ దశరథ్, హరీశ్ శంకర్, తదితరులు పాల్గొని నూతన వధూవరులకు తమ ఆశీస్సులు అందజేశారు.