టాలీవుడ్ యువ హీరో యూత్ స్టార్ నితిన్ హీరోగా శ్రీలీల హీరోయిన్ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించిన అవైటెడ్ చిత్రం “రాబిన్ హుడ్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ చిత్రం కొంచెం లేట్ అయినా కూడా ఇపుడు మంచి బుకింగ్స్ ని కనబరుస్తుంది అని చెప్పవచ్చు. ఇలా ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకున్నట్టుగా మేకర్స్ ఇపుడు కన్ఫర్మ్ చేశారు.
సెన్సార్ యూనిట్ వారు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ని ఇచ్చినట్టుగా తెలిపారు. ఇక ఈ సమ్మర్ లో మొదటి సినిమాగా మేకర్స్ ప్రొజెక్ట్ చేస్తున్న ఈ చిత్రం ఇపుడు అన్ని పనులు పూర్తి చేసుకొని ఎట్టకేలకి గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ చిత్రానికి జీవి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాతో వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ గట్టి బడ్జెట్ తోనే ఈ సినిమాని తెరకెక్కించారు. అలాగే ఈ మార్చ్ 28న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కి తీసుకొస్తున్నారు.
U/A for #Robinhood ????
He is coming with wholesome family entertainment this summer.
3 days to go ❤????Bookings now open!
????️ https://t.co/ogblfmwZTd#RobinhoodTrailer TRENDING TOP on YouTube ❤????
▶️ https://t.co/h2nhPhMrqEGRAND RELEASE WORLDWIDE ON MARCH 28th.… pic.twitter.com/GXsyOpOQMQ
— Mythri Movie Makers (@MythriOfficial) March 25, 2025