సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఇండస్ట్రీకి కూడ సూపర్ హ్యాపీ

సినీ ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఇండస్ట్రీకి కూడ సూపర్ హ్యాపీ

Published on Jan 27, 2021 10:00 PM IST

కోవిడ్ నేపథ్యంలో అనేక నిబంధనల నడుమ సినిమా థియేటర్లు తెరుచుకున్నాయి. ప్రస్తుతం 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్నాయి. ఈ కండిషన్లతో వసూళ్లు తగ్గడం, టికెట్ ధరలు పెరగడం, టికెట్ల కొరత, ఎక్కువ షోల కోసం స్క్రీన్ల విషయంలో పోటీ నెలకొనడం లాంటి సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ త్వరలోనే తీరిపోయేలా కేంద్ర ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. థియేటర్లలో అధిక శాతం ప్రేక్షకులకు అనుమతి ఇవ్వవచ్చని తాజా నిబంధనల్లో తెలిపింది.

ఈ కొత్త వెసులుబాటు ఫిబ్రవరి నుండి అమలులోకి రానుంది. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసార మాధ్యమాల మంత్రిత్వ శాఖ గైడ్‌లైన్స్‌ విడుదల చేసింది. అయితే ఈ పెంపును 50 శాతం నుండి ఎంత శాతం వరకు తీసుకెళ్లాలి అది 75 శాతమా లేదా 80 శాతమా లేకపోతే 90 శాతమా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. గతంలో ‘మాస్టర్’ రిలీజ్ సమయంలో ఆక్యుపెన్సీని 100 శాతం చేయాలని తమిళ సినీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరగా అనుమతులు లభించాయి. కానీ కేంద్రం ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆక్యుపెన్సీని పెంచుకునే వెసులుబాటును కల్పించనుంది. ఈ మార్పుతో అటు ప్రేక్షకులు, ఇటు ఇండస్ట్రీ జనం హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు