విడుదల తేదీ : మార్చి 01, 2024
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.25/5
నటీనటులు: వెన్నెల కిషోర్, సంయుక్త విశ్వనాథన్, మురళీ శర్మ తదితరులు
దర్శకుడు: టీజీ కీర్తి కుమార్
నిర్మాత: అదితి సోని
సంగీత దర్శకులు: సైమన్ కె కింగ్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ కెవిన్ ఎ
ఎడిటింగ్: కాశీష్ గ్రోవర్
సంబంధిత లింక్స్: ట్రైలర్
వెన్నెల కిషోర్ హీరోగా నటించిన తాజా స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ ‘చారి 111’. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ప్రేక్షకులను ఈ సినిమా ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !
కథ :
చారి (వెన్నెల కిషోర్) రుద్రనేత్రలో ఒక ఏజెంట్. డ్యూటీలో ఎప్పడూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ హెడ్ రావు (మురళీశర్మ) చేత చివాట్లు తింటుంటాడు. ఈ క్రమంలో ఓ హ్యుమన్ బాంబ్ ద్వారా ఓ బ్లాస్ట్ జరుగుతుంది. ఆ క్రైమ్‌ను సాల్వ్ చేయడానికి చారి (వెన్నెల కిషోర్) ను ఏజెంట్ గా అపాయింట్ చేస్తారు. అలాగే ‘ప్లాన్ బి’గా ఈషా (సంయుక్త విశ్వనాథన్)ను కూడా ఈ మిషన్ లో భాగం చేస్తారు. అసలు ఇంతకీ, ఈ క్రైమ్ వెనుక ఉన్న వ్యక్తి ఎవరు ?, అతను ఇండియా పై ఎందుకు ఈ బ్లాస్ట్ లు ప్లాన్ చేశాడు ?, చారి అతన్ని ఎలా అంతం చేశాడు ? అనేది మిగిలిన కథ.
ప్లస్ పాయింట్స్ :
వెన్నెల కిషోర్ గత చిత్రాలు కంటే భిన్నంగా వచ్చిన ఈ స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ లో వెన్నెల కిషోర్ అద్భుతంగా నటించారు. వెన్నెల కిషోర్ కామెడీ సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. డ్యూటీలో ఎప్పడూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ అందరి చేత చివాట్లు తినే ఏజెంట్ వెన్నెల కిషోర్ పెద్ద క్రైమ్‌ను ఎలా సాల్వ్ చేశాడనే ప్లే కొన్ని చోట్ల ఆకట్టుకుంది. ఇక క్లైమాక్స్ లో నడిచే యాక్షన్ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ లో వచ్చే కామెడీ అండ్ ఎమోషనల్ సీన్స్ కూడా బాగానే ఆకట్టుకున్నాయి.
సంయుక్త విశ్వనాథన్ హీరోయిన్ గా బాగానే నటించింది. ఆమె నటన కూడా చాలా బాగుంది. రచయిత.. దర్శకుడు టీజీ కీర్తి కుమార్ రాసుకున్న మెయిన్ స్టోరీ పాయింట్, కొన్ని కామెడీ సన్నివేశాలు బాగున్నాయి. ఇక మిగిలిన నటీనటుల విషయానికి వస్తే.. మురళీ శర్మ, కమెడియన్ సత్య కూడా చాలా బాగా నటించారు. అలాగే బ్రహ్మాజీతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు.
మైనస్ పాయింట్స్ :
ఈ చారి 111 సినిమాలో స్టోరీ పాయింట్ బాగున్నా.. పెద్దగా కథ లేకపోవడం కథనం కూడా రెగ్యూలర్ గా, రొటీన్ గా సాగడం ఈ సినిమాకి మైనస్ అయ్యాయి. అదేవిదంగా ప్రధానంగా ఈ చిత్రంలో ప్రస్తావించిన కొన్ని అంశాలు చాలా సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక డ్యూటీలో ఎప్పడూ సిల్లీ మిస్టేక్స్ చేస్తూ ఏజెంట్ చారి చేసే కామెడీ కూడా సిల్లీగా సాగింది. అలాగే, ఈ సినిమాలో చూపించిన ఫ్లాష్ బ్యాగ్ కూడా ఎఫెక్టివ్ గా లేదు. విలన్ పాత్ర ముగింపును కొంచెం బాగా చూపించాల్సింది.
అదే విధంగా విలన్ తల్లి పాత్రలోనే మోటివ్ పెట్టినప్పుడు ఆ పాత్ర ఎండింగ్ ను అంతే ఇంట్రెస్టింగ్ గా ఎండ్ చేయాల్సింది. అన్నట్టు ఏజెంట్ చారి పాత్ర యొక్క గ్రాఫ్ లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. అయితే, సినిమాలో కొన్ని చోట్ల కామెడీ మేకింగ్ మరియు ఫన్నీ డైలాగ్స్ ఉన్నప్పటికీ.. నాటకీయ సన్నివేశాలు ఎక్కువైపోయాయి.. దీనికి తోడు స్క్రీన్ ప్లే కూడా రొటీన్ వ్యవహారాలతోనే నడుస్తోంది.
సెకండాఫ్‌లో అక్కడక్కడ ఉన్న ల్యాగ్ సీన్స్ అండ్ లాజిక్ లేని సీన్స్ ఎక్కువగా ఉన్నాయి. పైగా ఫస్ట్ హాఫ్ కూడా పెద్దగా ఎంటర్ టైన్ గా సాగదు. హీరోయిన్ పాత్ర ఏది బలంగా అనిపించదు.
సాంకేతిక విభాగం :
సాంకేతిక నిపుణుల గురించి మాట్లాడుకుంటే.. దర్శకుడు టీజీ కీర్తి కుమార్ ఓ ఇంట్రెస్టింగ్ ఫన్నీ పాయింట్ తో ఈ స్క్రిప్ట్ రాసుకున్నాడు. అయినప్పటికీ.. దర్శకుడు చెప్పాలనుకున్న కథలో డెప్త్ లేదు. పైగా సినిమాని ఇంట్రెస్ట్ గా మలచలేకపోయాడు. ఇక సంగీతం విషయానికి వస్తే..
సైమన్ కె కింగ్ నేపథ్య సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫర్ రిచర్డ్ కెవిన్ ఎ పనితనం ఈ సినిమాకి ప్రధాన బలం. ప్రతి ఫ్రేమ్ ను ఆయన చాలా ఎఫెక్టివ్ గా తీశారు. ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని అదితి సోని నిర్మాణ విలువలు కూడా చాలా బాగున్నాయి.
తీర్పు :
‘చారి 111’ అంటూ వచ్చిన ఈ స్పై యాక్షన్ ఫన్ ఎంటర్టైనర్ లో వెన్నెల కిషోర్ కామెడీ మూమెంట్స్ అండ్ కొన్ని ఫన్ ఎలిమెంట్స్ బాగానే ఉన్నాయి. అయితే, కీలక సన్నివేశాల్లో చాలా చోట్ల బోర్ కొట్టడం, చాలా సీన్స్ బాగా స్లో నెరేషన్ తో సాగడం, అలాగే సినిమాలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే వంటి అంశాలు ఈ సినిమాకి బలహీనతలుగా నిలిచాయి. మొత్తమ్మీద ఈ చిత్రంలో వెన్నెల కిషోర్ కామెడీ బాగున్నా .. ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా కనెక్ట్ కాదు.
123telugu.com Rating: 2.25/5
Reviewed by 123telugu Team