తెలంగాణ ప్రజలకు ఎంతో సుపరిచితమైన ప్యాట్నీసెంటర్ చందన బ్రదర్స్ వారి సరికొత్త బ్రాంచ్ ఇప్పుడు జహీరాబాద్ లో ప్రారంభం అయింది. గౌరవనీయులు ఎంపీ శ్రీ బి.బి. పాటిల్ గారు, గౌరవనీయులు ఎమ్యెల్యే శ్రీ కొనింటి మాణిక్ రావు గారు మరియు ప్రముఖ యువ అందాల నటీమణులు మెహరీన్, హనీరోజ్ చేతులమీదుగా అంగరంగ వైభవంగా ఈ బ్రాంచ్ యొక్క ప్రారంభోత్సవం నేడు జరిగింది. కాగా ఆ చుట్టుప్రక్కల జిల్లాలకు ఇదే అతిపెద్ద షాపింగ్ మాల్ కావడం విశేషం.
ఇప్పటి నుండి హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్ళి షాపింగ్ చేయవలసిన అవసం లేకుండా ఇక్కడే అన్ని హంగులతో నాలుగు అంతస్థులలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఎంతో సువిశాలమైన అత్యాధునిక, అంతర్జాతీయ షాపింగ్ అనుభూతి మీకు అందిస్తూ కుటుంబమంతటకీ కావలసిన వస్త్రాలు హోల్ సేల్ ధరలకే విక్రయిస్తున్నామని అంటోంది చందన బ్రదర్స్ యాజమాన్యం. అలాగే దీని ద్వారా సుమారు 300 మందికి ఉపాది కలిపిస్తున్నామని సంస్థ అధినేత శ్రీ అల్లక సత్యనారాయణ గారు తెలిపారు. ఇంతగా మమ్మలని ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న తెలంగాణా ప్రజలకు ఆయన ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.