మన తెలుగు యువ హీరోయిన్ చాందిని చౌదరి ఇప్పుడు పలు చిత్రాలతో బిజీగా ఉంది. ఈ ఏడాదిలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ “గామి” లో ఆమె మంచి నటన కనబరచగా ఈ చిత్రం తర్వాత చాందిని తనపై ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ సినిమాతో అలాగే డీసెంట్ చిత్రం మ్యూజిక్ షాప్ మూర్తి అంటూ రెండు సినిమాలతో ఇదే ఏడాదిలో పలకరించింది. మరి ఈ చిత్రాల్లో ఆల్రెడీ మ్యూజిక్ షాప్ మూర్తి కొన్ని రోజులు కితమే ఓటిటిలో రిలీజ్ కి రాగా ఇప్పుడు తన పోలీస్ థ్రిల్లర్ చిత్రం “యేవమ్” అందుబాటులోకి వచ్చేసింది.
మరి ఈ చిత్రాన్ని మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఆహా వారు సొంతం చేసుకోగా ఇందులో ఈ చిత్రం ఈ మధ్యాహ్నం 12 గంటల నుంచి అందుబాటులోకి వచ్చేసింది. దర్శకుడు ప్రకాష్ దంతులూరి తెరకెక్కించిన ఈ చిత్రం మాత్రం గామి, మ్యూజిక్ షాప్ మూర్తి చిత్రాల కంటే తక్కువే పెర్ఫామ్ చేసింది. మరి ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు ఇప్పుడు ఆహా లో అందుబాటులో ఉంది ట్రై చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి కీర్తన శేష్, నీలేష్ మందలపు సంగీతం అందించగా ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాణం వహించారు.