టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘కార్తికేయ-2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సె్సషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్ హీరోగా నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకుపోయింది. ఇక ఈ సినిమాలో కథకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. శ్రీకృష్ణునికి సంబంధించి ఇందులో చూపెట్టిన కథ ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అయితే, ఈ సినిమాకు మరో సీక్వెల్ ‘కార్తికేయ-3’ని తెరకెక్కించబోతున్న ట్లు చందూ మొండేటి గతంలో వెల్లడించాడు. అయితే, ఇప్పుడు తండేల్ మూవీ రిలీజ్ తర్వాత తాను కార్తికేయ-3 మూవీపై ఫోకస్ పెడతానని చెప్పారు. ఇక ఈ మూవీ కోసం తన దగ్గర అద్భుతమైన కథ రెడీగా ఉందని.. ఈ కథ శ్రీ కృష్ణుడి చుట్టూ తిరుగుతుందని ఆయన తెలిపారు.
దీంతో ఈ సినిమాలో ఎలాంటి కథ ఉండబోతుందా.. ఇందులో శ్రీకృష్ణుని గురించి ఎలాంటి విషయాలు చూపెడతారా అనేది ఆసక్తికరంగా మారింది. మరి చందూ మొండేటి కార్తికేయ-3 చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.