తలైవి’ బయోపిక్ లో మార్పులు !

Published on Jul 12, 2020 12:19 am IST


తమిళ డైరెక్టర్ ఎ.ఎల్‌.విజ‌య్ దర్శకత్వంలో దివంగత నేత జయలలిత బయోపిక్ గా రాబోతున్న చిత్రం ‘తలైవి’. ఈ బయోపిక్ లో జయలలిత పాత్రలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇక అమ్మ బయోపిక్ అనేసరికి మొదటినుండి ఈ సినిమా పై ఆసక్తి ఎక్కువైంది. అయితే కంగనా రనౌత్ ను అచ్చం అమ్మలా మార్చెందుకు హాలీవుడ్ మూవీ ‘డార్కెస్ట్ హవర్’కి మేకప్ మెన్ గా పనిచేసిన ‘గ్యారీ ఓల్డ్ మెన్, ‘అమ్మ’ బయోపిక్ కోసం ఇండియాకి తీసుకువచ్చారు.

కాగా ఈ కరోనా సమయంలో ఆయన మళ్ళీ హాలీవుడ్ నుండి ఇండియాకి వచ్చే పరిస్థితి లేదు. దాంతో తరువాత జరగబోయే షెడ్యూల్ లో మేకప్ బ్యాచ్ మొత్తాన్ని మార్చాలి. ఇక జయలలిత జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలతో పాటు ఆమె చివరి రోజులను కూడా ఈ సినిమాలో చూపించనున్నారు. దాంతో కంగనా 18 ఏళ్ల వయసు పాత్ర నుండి నుండి 60 ఏళ్ల వయసు గల పాత్ర వరకూ ఈ చిత్రంలో కనిపించనుంది. ఈ క్రమంలో కంగనా మొత్తం నాలుగు గెటప్స్ లో కనిపించబోతుంది.

సంబంధిత సమాచారం :

More