త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ మరియు ఉపాసన నేడు 11 సంవత్సరాల వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా వారి ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్స్‌లో హార్ట్ ఫుల్ పిక్ ని పంచుకున్నారు. ఈ మనోహరమైన జంట 11 సంవత్సరాలు అద్భుతంగా గడిచింది అంటూ ఉమ్మడిగా పోస్ట్‌ను షేర్ చేస్తూ హార్ట్ ఎమోజీ ని జోడించారు. ప్రస్తుతం ఈ సోషల్ మీడియా పోస్ట్ వేల లైక్స్ మరియు కామెంట్స్‌తో వైరల్ అవుతుంది.
కాగా మెగా అభిమానులు మరియు శ్రేయోభిలాషులు చరణ్, ఉపాసన ల 11వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా కామెంట్స్ రూపంలో వారికీ శుభాకాంక్షలను తెలుపుతున్నారు. ఇక ప్రస్తుతం కెరీర్ పరంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ షణ్ముగం దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ డ్రామా మూవీ గేమ్ ఛేంజర్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. కైరా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. గేమ్ ఛేంజర్ తర్వాత, చరణ్ బుచ్చిబాబు సనాతో కలిసి విలేజ్ డ్రామా మూవీలో నటించనున్నారు.