అర్జునుడిగా చరణ్, కృష్ణుడిగా మహేష్.. ఆ భారీ సినిమాకి ఫ్యాన్స్ డిమాండ్

ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో అలాగే పాన్ ఇండియా వైడ్ గా కూడా కల్కి (Kalki 2898 AD) మ్యానియా ఏ రీతిలో నడుస్తుందో చూస్తున్నాం. అయితే ఈ సినిమా వచ్చాక దాదాపు అంతా మన పురాణాల కోసమే చర్చించుకుంటున్నారు. మెయిన్ గా సోషల్ మీడియాలో యువత అంతా కల్కి మహాభారతం సీక్వెన్స్ ల కోసమే మాట్లాడుకుంటుండగా అందులో ఒకో పాత్ర ఒకొకరికి సెట్ అవుతుంది అని చెప్పుకుంటున్నారు.

అలా కల్కి లో పవర్ఫుల్ పాత్రలు అర్జునిడిగా యంగ్ హీరో విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) నటించగా ఈ రోల్ కి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు అని చరణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇక అర్జునుడి రథ సారథిగా అయితే సూపర్ స్టార్ మహేష్ యూనానిమస్ గా సెట్ అవుతారని అందులో డౌట్ లేదని మహేష్ బాబు అభిమానులు మాత్రమే కాకుండా ఇతర అభిమానులు కూడా భావిస్తున్నారు.

అయితే ఇవి కల్కి లో సాధ్యం అవుతాయి అవ్వవు అనేది పక్కన పెడితే మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ఉంది ఆ సినిమాకి మాత్రం సాధ్యం కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అదే దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి (SS Rajamouli) డ్రీం ప్రాజెక్ట్ “మహాభారతం” (Maha Bharatam) ఈ సినిమా చేస్తానని జక్కన్న ఎప్పుడు నుంచో చెబుతుండగా ఈ సినిమాలో వారిని ఇలా చూడాలని అభిమానులు డిమాండ్, రిక్వెస్ట్ అన్నీ చేస్తున్నారు. మరి ఈ సెన్సేషనల్ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనేది ఇంకా ఆసక్తిగా మారింది. మరి చూడాలి జక్కన్న తన డ్రీం ప్రాజెక్ట్ లో ఎవరెవరికి ఎలాంటి పాత్రలు ఇస్తారు అనేది.

Exit mobile version