‘ఆచార్య’ ఇంటర్వెల్ కే చరణ్ ఎంట్రీ !

Published on Jan 26, 2021 3:00 am IST

మెగాస్టార్ చిరంజీవి – సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. కాగా ఈ షూట్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారు. అయితే చరణ్ ఈ షూట్ పాల్గొంటున్నాడు. కాగా సినిమాలో చరణ్ ఎంట్రీ కూడా ఈ సీన్స్ లోనే ఉంటుందని.. అంటే ఆచార్య ఇంటర్వెల్ కి చరణ్ కనిపిస్తాడని టాక్ వినిపిస్తోంది.

ఇక రాష్ట్రంలోని దేవాలయాలు మరియు అనేక ఇతర మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన ఎండోమెంట్స్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా మెగాస్టార్ ఈ సినిమాలో కనిపిస్తారనే విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెగాస్టార్ సరసన కాజల్ హీరోయిన్ గా తీసుకున్నారు. సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందని, చిరు పాత్రకు చరణ్ పాత్ర ప్రేరణగా నిలుస్తోందని తెలుస్తోంది. మెగాస్టార్ ఈ చిత్రం కోసం బరువు తగ్గడంతో పాటు చాలా మేక్ ఓవర్ అయ్యారు. ఈ చిత్రంలో రెజీనా ఓ సాంగ్ లో కనిపించనుంది. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :