ఆ అప్డేట్ కావాలంటున్న చరణ్ ఫ్యాన్స్

Published on Jul 8, 2020 3:00 am IST


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ ఆయన నెక్స్ట్ మూవీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ లో నటిస్తున్నారు. ఈ మూవీలో చరణ్ అల్లూరి సీతా రామరాజు పాత్ర చేస్తుండగా… ఫస్ట్ లుక్ వీడియో ఆసక్తి రేపింది. ఈ మూవీ షూటింగ్ కరోనా వైరస్ వ్యాప్తి వలన మరింత లేటవుతుంది. అలాగే ఆర్ ఆర్ ఆర్ విడుదల జనవరి 2021లో అసాధ్యమేనన్న మాట గట్టిగా వినిపిస్తుంది.

ఆర్ ఆర్ ఆర్ తరువాత చరణ్ దర్శకుడిపై అనేక పుకార్లు ప్రచారంలో ఉండగా…చరణ్ క్లారిటీ ఇవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. చరణ్ ఎవరైనా దర్శకుడితో మూవీ కమిటయ్యాడా లేదా అనేది తెలియాలట వారికి. కాగా చిరు కొరటాల సినిమాలో చరణ్ పాత్ర డౌటే అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ నుండి చరణ్ బయటకి వచ్చి నెలరోజుల డేట్స్ ఇవ్వడం కష్టమే అంటున్నారు.

సంబంధిత సమాచారం :

More