తాజా సమాచారం ప్రకారం ఛార్మీ త్వరలో జ్యోతిలక్ష్మి అనే సినిమాలో నటించనుంది. ముందుగా ఈ సినిమాను పూరి జగన్నాద్ దర్శకత్వం వహించాల్సివుంది. అయితే ఇప్పుడు ఆ బాధ్యతను పూరి దగ్గర సంబంధీకుడి చేతిలో పడిందని తెలుస్తుంది
టైటిల్ రోల్ లో నటించిన దాదాపు అన్ని సినిమాలలో ఛార్మీ మంచి నటన కనబరిచి విమర్శకుల ప్రశంసలను అందుకుంది. కెరీర్ లీన్ ఫేజ్ లో వున్న దశలో ఈ భామకు ఒక మంచి హిట్ అత్యవసరం. ఈ సినిమా ఈఏడాది చివర్లో గాని, వచ్చే ఏడు మొదట్లోగానీ మొదలుకావచ్చు. మరి ఆ హిట్ ఈ సినిమాతో రావాలని కోరుకుందాం