మిల్కీ బ్యూటీ తమన్నా మెయిన్ లీడ్ లో తెలుగులో చాలా కాలం తర్వాత ఎంట్రీ ఇస్తున్న అవైటెడ్ సినిమానే “ఓదెల 2”. తన రచ్చ దర్శకుడు సంపత్ నంది దర్శకత్వ పర్యవేక్షణలో తెరకెక్కించిన ఈ చిత్రం హారర్ కం డివోషనల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కి ఇపుడు రిలీజ్ కి రాబోతుంది. ఇక ఈ చిత్రం రిలీజ్ కి ముందు ప్రమోషన్స్ ని కూడా ఫుల్ స్వింగ్ లో చేసుకుంటూ ఉండగా ఇపుడు ప్రీరిలీజ్ ఈవెంట్ కి సిద్ధం అయ్యింది.
మరి మేకర్స్ ఈ ఏప్రిల్ 14న ప్రీరిలీజ్ ఈవెంట్ ని ప్లాన్ చేసుకోగా ఈ ఈవెంట్ కోసం సంపత్ నంది నెక్స్ట్ సినిమా హీరో చార్మింగ్ స్టార్ శర్వానందన్ ముఖ్య అతిధిగా వస్తున్నట్టుగా ఇపుడు ఖరారు అయ్యింది. దీనితో ఈ యువ హీరో ప్రెజెన్స్ తో ఈ సినిమా ఈవెంట్ జరగనుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి అశోక్ తేజ దర్శకత్వం వహించగా ఈ సినిమాకి అజనీష్ లోకనాథ్ సంగీతం అందించాడు. అలాగే ఈ ఏప్రిల్ 17న గ్రాండ్ గా ఈ చిత్రం రిలీజ్ కి రాబోతుంది.