ప్రస్తుతం ఐపీఎల్ హవా ఇండియా అంతా నడుస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే నేడు రెండు మ్యాచ్ లు హోరాహోరీగా జరిగాయి. ఇక వీటిలో హైదరాబాద్, రాజస్థాన్ మ్యాచ్ లో హైదరాబాద్ భారీ స్కోరు చేసి ఘన విజయం సాధించి అదరగొట్టింది. ఇక ఈ తర్వాత అవైటెడ్ చెన్నై, ముంబై మ్యాచ్ జరుగగా ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ సింపుల్ విన్ తో గెలిచేసింది అని చెప్పాలి.
థలా ధోని బాటింగ్ క్రీస్ లో కూడా చూడాలి అనుకునేవారి కల కూడా నెరవేరి రచిన్ రవీంద్ర అలాగే రుతురాజ్ గైక్వాడ్ ల అద్భుత ఇన్నింగ్స్ తో చెన్నై ముంబై ఇండియన్స్ నిర్దేశించిన 155 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్స్ తేడాతో గెలిచేశారు. దీనితో చెన్నైకి ఒక శుభారంభం దక్కింది అని చెప్పవచ్చు.