మన దగ్గర కూడా “చెన్నకేశవ రెడ్డి” మ్యానియా స్టార్ట్.!

Published on Sep 22, 2022 12:55 pm IST

లేటెస్ట్ గా మన టాలీవుడ్ సినిమా దగ్గర రీ రిలీజ్ ల పర్వం స్టార్ట్ అయ్యి ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటున్నాయి అనేది చూస్తూనే ఉన్నాము. మన టాలీవుడ్ స్టార్ హీరోలు నటించిన కొన్ని భారీ హిట్స్ కల్ట్ క్లాసిక్ లు ఫ్యాన్స్ భారీ డిమాండ్ మేరకు మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. అలా ఇప్పుడు నందమూరి అభిమానుల వంతు రాగా నందమూరి బాలకృష్ణ నటించినటువంటి “చెన్నకేశవ రెడ్డి” సినిమాని గ్రాండ్ లెవెల్లో రీ రిలీస్ కి ఇప్పుడు ప్లాన్ చేసుకున్నారు.

మరి ఈ భారీ మాస్ యాక్షన్ సినిమా ఓవర్సీస్ లో షాకింగ్ రెస్పాన్స్ ను అందుకోగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్ స్టార్ట్ కావడంతో చెన్నకేశవ రెడ్డి మ్యానియా అదిరే లెవెల్లో స్టార్ట్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి మొత్తానికి అయితే ఈ చిత్రం రీ రిలీజ్ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్పాలి. ఇక ఈ సినిమాని అయితే దర్శకుడు వి వి వినాయక్ దర్శకత్వం వహించగా శ్రేయా హీరోయిన్ గా నటించింది అలాగే మణిశర్మ సాలిడ్ మ్యూజిక్ అందించారు.

సంబంధిత సమాచారం :