“చిరు 156” విషయంలో డైరెక్టర్ వేరే లెవెల్ కాన్ఫిడెన్స్.!


లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు నటిస్తున్న భారీ చిత్రం కోసం తెలిసిందే. తన కెరీర్ లో 156వ చిత్రంగా అయితే దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్నాడు. మరి చాలా కాలం తర్వాత మెగాస్టార్ నుంచి ఒక బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా ఇది వస్తుండగా ఈ సినిమాపై అయితే ఇప్పుడు క్రేజీ అప్డేట్ ని కూడా మేకర్స్ అందించారు. ఆయితే ఈ సినిమా విషయంలో మేకర్స్ మొదటి నుంచి కూడా ఓ రేంజ్ లో హైప్ ని రేపుతుండగా లేటెస్ట్ గా ఈ యంగ్ దర్శకుడు చేసిన కామెంట్స్ మెగా ఫ్యాన్స్ లో సరికొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తున్నాయి.

తాను రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఈ చిత్రం మెగాస్టార్ గారి కెరీర్ లో ఒక టాప్ 10 చిత్రాలు ఉంటే వాటిలో టాప్ 3 లో ఒకటిగా నిలుస్తుంది అని తెలిపాడు. అంతే కాకుండా చిరు కెరీర్ లో ఒక జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తర్వాత ఎలా మాట్లాడుకున్నారో ఈ చిత్రం తర్వాత కూడా అలా మాట్లాడుకుంటారని తెలిపాడు. మరి ఏం ప్లాన్ చేస్తున్నారో కానీ ఈ మాటలతోనే సినిమాపై గట్టి హైప్ ని మేకర్స్ రేపేస్తున్నారు.

Exit mobile version