చిరు మనసులో తన ఫ్యాన్స్ కి ఉన్నత స్థానం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

చిరు మనసులో తన ఫ్యాన్స్ కి ఉన్నత స్థానం.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Sep 30, 2024 12:00 AM IST

మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఇప్పుడు భారీ చిత్రం “విశ్వంభర” చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. యువ దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించిన ఈ భారీ ప్రాజెక్ట్ చేస్తున్న సమయంలోనే మెగాస్టార్ కి పలు అరుదైన గౌరవాలు దక్కాయి. మొదటిగా అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ అవార్డు చిరుని వరించగా మొన్ననే గిన్నిస్ వరల్డ్ రికార్డుని కూడా మెగాస్టార్ కైవసం చేసుకొని టాలీవుడ్ సహా ఇండియన్ సినిమా దగ్గర హిస్టరీ క్రియేట్ చేశారు.

ఇక ఇదిలా ఉండగా రీసెంట్ గా జరిగిన ఐఫా అవార్డ్స్ లో కూడా మెగాస్టార్ అవుట్ స్టాండింగ్ అఛీవ్మెంట్ ఇన్ ఇండియన్ సినిమా అంటూ మరో స్పెషల్ అవార్డుని గెలుచుకున్నారు. ఇలా తన కెరీర్ లో ఎన్నో అవార్డులు గెలుచుకున్న చిరు ఆ అవార్డు వేడుకలో చేసిన కామెంట్స్ మెగా అభిమానులని మరింత ఆనందాన్ని కలిగించాయి. తనకి తన అభిమానులని మించిన అవార్డు ఇంకొకటి లేదని వారి తర్వాత మిగతా అవార్డులు అనే రీతిలో తన అభిమానులకి తన గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో తెలిపారు. దీనితో చిరు విషయంలో అభిమానులు మరింత ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు