పవన్ స్పీచ్ పై మెగాస్టార్ చిరంజీవి సాలిడ్ రెస్పాన్స్ వైరల్

పవన్ స్పీచ్ పై మెగాస్టార్ చిరంజీవి సాలిడ్ రెస్పాన్స్ వైరల్

Published on Mar 15, 2025 1:00 AM IST

తెలుగు రాష్ట్రాల పవర్ స్టార్ అలాగే ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా అయినటువంటి పవన్ కళ్యాణ్ నేడు తన పొలిటికల్ పార్టీ జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా తన నియోజకవర్గ పరిధిలోని జరుపుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సభలో పవన్ కళ్యాణ్ స్పీచ్ కోసం అంతా ఓ రేంజ్ లో ఎదురు చూడగా ఈ స్పీచ్ పై ఓ సర్ప్రైజింగ్ వ్యక్తి రెస్పాన్స్ అందించడం మెగా అభిమానులుకి మరింత ఆనందం కలిగించింది.

అయితే అది మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవినే.. పవన్ స్పీచ్ ఇలా అయ్యిందో లేదో చిరు తన ఎక్స్ ఖాతా నుంచి వదిలిన పోస్ట్ వైరల్ గా మారింది. “మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్ జనసేన జయకేతన సభలో నీ స్పీచ్ కి మంత్రముగ్ధుడినయ్యాను.సభ కొచ్చిన అశేష జన సంద్రం లానే నా మనసు ఉప్పొగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమస్ఫూర్తి తో నీ జైత్రయాత్ర నిర్విఘంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు” అంటూ చేసిన ఈ పోస్ట్ ఇపుడు అభిమానుల్లో పట్టరాని ఆనందం నింపింది. దీనితో ఈ సడెన్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు