ఇటీవలే క్రికెట్ రారాజు అయిన సచిన్ టెండూల్కర్ నెల్లూరులోని ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నాడు. అది జరిగిన చాలా తక్కువ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి అదే దారిలో అడుగేసాడు. చిరంజీవి పశ్చిమ గోదావరి జిల్లా, మొగల్తూరు మండలంలోని పేరుపాలెం అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు.
మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న ‘సంసద్ ఆదర్ష్ గ్రామ యోజన’లో భాగంగా ఆయన ఆధ్వర్యంలోనే చిరంజీవి ఈ విలేజ్ ని దత్తత తీసుకున్నాడు. ఈ గ్రామంలో వైద్య సదుపాయాలను, హౌసింగ్, వాటర్, రోడ్డు లాంటి సదుపాయాలను డెవలప్ చేయనున్నాడు. త్వరలోనే చిరంజీవి ఈ గ్రామాన్ని విజిట్ చేసి అక్కడి పరిస్థితులను పరిశీలించనున్నారు.