వెంకీ మామను ఫాలో అవుతున్న మెగాస్టార్

దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనం చూశాం. ఈ సినిమా వెంకటేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా వసూళ్ల పరంగా కూడా వెంకటేష్ కెరీర్‌లో బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది.

ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి తన నెక్స్ట్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఉగాది సందర్భంగా లాంచ్ చేశారు. అయితే, ఈ సినిమా కోసం మెగాస్టార్ కూడా వెంకీ బాటలో పయనించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం చిత్రంలో వెంకటేష్ ఓ సాంగ్ పాడిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మెగా 157 చిత్రం కోసం చిరు కూడా ఓ సాంగ్ పాడేలా దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. దీనికి చిరంజీవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి వెంకీ బాటలో చిరు కూడా పయనిస్తున్నాడనేది ఆసక్తికర అంశంగా మారింది.

Exit mobile version