చిరు కూడ పవన్ అభిమానిలా మారిపోయారు

Published on Apr 8, 2021 10:40 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా కోసం అభిమానులే కాదు ఆయన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడ ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్నారు. దాదాపు మూడేళ్ళ తర్వాత పవన్ వెండితెర మీద కనిపించనుండటంతో సినిమా మీద అంచనాలు భారీగా ఉన్నాయి. పవన్ ఫాన్స్ అయితే ఎప్పుడెప్పుడు షోలు మొదలవుతాయా అని ఉత్కంఠతో ఉన్నారు. ఈ ఆతురత వారిలోనే కాదు చిరులో ఎక్కువగానే కూడ ఉంది.

చాలా కాలం తరవాత పవన్ ను వెండితెర మీద చూడటానికి మీలాగే నేను కూడ ఎదురుచూస్తున్నాను. అమ్మ, కుటుంబ సభ్యులతో రేపు సాయంత్రం థియేటర్లలో ‘వకీల్ సాబ్’ చూస్తున్నాను. సినిమా చూసి నా స్పందనను మీతో పంచుకోవాలని అనుకుంటున్నారు అంటూ సగటు అభిమానిలా ట్వీట్ చేశారు చిరు. అంతేకాదు పవన్ కు మేకప్ వేస్తూ క్రాఫ్ దువ్వుతున్న పాత ఫోటో ఒకదాన్ని పోస్ట్ చేశారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాను వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేశారు. ఇందులో శృతి హాసన్ కథానాయకిగా నటించగా అంజలి, నివేత థామస్, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటించారు.

సంబంధిత సమాచారం :