“విశ్వంభర” టీజర్ గ్లింప్స్ రాబోతుందా?

టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు వశిష్ట తెరకెక్కిస్తున్న అవైటడ్ భారీ చిత్రం “విశ్వంభర”. మరి మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా నిన్ననే డబ్బింగ్ పనులు కూడా మొదలు పెట్టుకున్నట్టుగా కన్ఫర్మ్ చేసుకుంది. అయితే ఇప్పుడు త్వరలోనే సినిమా నుంచి టీజర్ గ్లింప్స్ వచ్చే ఛాన్స్ ఉన్నట్టుగా బజ్ వినిపిస్తోంది.

ఆల్రెడీ డబ్బింగ్ కూడా మొదలయ్యింది. కొంతమేర పోస్ట్ ప్రొడక్షన్ కూడా పూర్తయ్యిన షాట్స్ తో సినిమాపై మరింత హైప్ ఇచ్చే విధంగా గ్లింప్స్ లాంటిది మేకర్స్ ప్లాన్ చేసే అవకాశం ఉందని చెప్పాలి. ఇక దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు అలాగే యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

Exit mobile version