పవన్ పై మెగా డాటర్ కామెంట్స్ వైరల్

పవన్ పై మెగా డాటర్ కామెంట్స్ వైరల్

Published on Jun 17, 2024 10:47 AM IST

మెగా డాటర్ చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించి కొత్త టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఇప్పటికే, సుస్మిత నిర్మాతగా పలు వెబ్ సిరీస్ లు, వెబ్ మూవీస్ వచ్చాయి. తాజాగా సుస్మిత నిర్మాతగా ‘పరువు’ అనే వెబ్ సిరీస్ వచ్చింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. కాగా ఈ వెబ్ సిరీస్ సక్సెస్ టాక్ అందుకున్న సందర్భంగా సుస్మిత ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు..

ఆ ఇంటర్వ్యూలో సుస్మిత మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి ఎన్నో విషయాలు చెప్పారు. సుస్మిత మాటల్లోనే.. ‘మా చిన్నతనంలో నాకు చరణ్ కు గొడవలు వచ్చేది మా పవన్ బాబాయ్ వల్లే. ఆయన ఇద్దరికీ గొడవ పెట్టి సినిమాను చూసినట్లు చూస్తారు. అది సరదాగా ఉండేది. ఆయన మాతో ఎప్పుడూ సరదాగా ఉండేవారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో సక్సెస్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన ప్రజల మనిషి. వారి కోసం ఆయన ఏదైనా చేస్తాడు’ అంటూ సుస్మిత చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు