చిన్ననాటి క్రష్ పై చిరు ఆసక్తికర కామెంట్స్.!

ప్రస్తుతం మన టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన సాలిడ్ ఎంటర్టైనర్ “వాల్తేరు వీరయ్య” భారీ హిట్ అయ్యింది. ఇక దీనితో నెక్స్ట్ మెగా ఫ్యాన్స్ “భోళా శంకర్” కోసం ఎదురు చూస్తున్నారు. మరి ఇదిలా ఉండగా చిరు ఈ గ్యాప్ లోనే ఓ ఓటిటి సరికొత్త టాక్ షో లో అయితే పాల్గొన్నారు. అదే నిజం విత్ స్మిత షోలో మొదటి ఎపిసోడ్ కి గాను చిరు హాజరు అయ్యి పలు ఆసక్తికర అంశాలు ఇది వరకు ఎన్నో షోస్ లో రివీల్ చెయ్యని అంశాలు పంచుకున్నారు.

అలాగే ఇందులో మొదటిసారిగా చిరు తన చిన్ననాటి క్రష్ కోసం ఓపెన్ అయ్యారు. అందరి జీవితాల్లో చిన్నప్పుడు క్రష్ ఉన్నట్టే తనకి కూడా ఉంది అని ఇప్పుడు పేర్లు అవి చెప్పి ఎందుకు ఇబ్బంది పెట్టడం ఇప్పుడు ఆ అమ్మాయి ఫ్యామిలీ తో ఉండి ఉంటుంది పిల్లలు బహుశా మనవళ్ళు కూడా ఉంటారని నవ్వుతూ చెప్పారు.

అంతే కాకుండా తన తమ్ముడు నాగబాబు తో కలిసి స్కూల్ టైం చేసిన అల్లర్లు అమ్మాయిల దృష్టిలో పడాలని బస్సు లో వారి కోసం సీట్లు వదిలేయడం లాంటి ఎన్నో తాను చేసిన చిలిపి పనులు ఉన్నాయని ఇంట్రెస్టింగ్ అంశాలు షేర్ చేసుకున్నారు. అయితే ఈ విషయాలు అన్నీ కూడా తన భార్య సురేఖ కి తెలుసనీ చిరు కామెంట్స్ చేశారు.

Exit mobile version