ఈ రెండు తర్వాత చిరు సాలిడ్ ప్రాజెక్ట్.?

Published on Oct 30, 2020 9:32 pm IST


టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో “ఆచార్య” అనే చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ చిత్రం కొంత మేర షూట్ ను పూర్తి చేసుకొని బ్యాలన్స్ షూట్ కు రెడీ అవుతుంది. అయితే ఈ చిత్రం అనంతరం దర్శకులు వివి వినాయక్ అలాగే మెహర్ రమేష్ లతో ”లూసిఫర్” మరియు ”వేదాళం” రీమేక్స్ చేయనున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ రెండు చిత్రాల అనంతరం మరికొంతమంది దర్శకులు చిరు లైన్ లో ఉన్నారన్న సంగతి కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు చిరు ఓ డైరెక్ట్ సాలిడ్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో చేయాల్సిన ప్రాజెక్ట్ ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది అలాగే మాస్ దర్శకుడు బోయపాటితో కూడా చిరు ఒక సాలిడ్ మసాలా డ్రామా ప్లాన్ చేస్తున్నారని టాక్ కూడా వినిపిస్తుంది. మరి ఈ ఇద్దరిలో చిరు ఎవరి ప్రాజెక్ట్ ను టేకప్ చేస్తారో చూడాలి. ఏది చేసినా సరే రీసౌండ్ గట్టిగానే ఉంటుంది.

సంబంధిత సమాచారం :

More