యంగ్ బ్యూటీ నివేదా థామస్ నటిస్తున్న తాజా చిత్రం ‘35 – చిన్న కథ కాదు’ అనౌన్స్ చేసిన దగ్గర్నుంచి ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాను నందకిషోర్ డైరెక్ట్ చేయగా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు మేకర్స్. ఇక ఈ సినిమా రిలీజ్‌కి దగ్గరపడటంతో చిత్ర ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో హీరోయిన్ నివేదా థామస్ చిట్ చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ చిట్ చాట్‌లో ఆమె పలు ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది. అయితే, 35 మూవీలో ఆమె ఓ తల్లి పాత్రలో నటిస్తుండటంతో చైల్డ్ ఆర్టిస్టులు ఎలాంటి ఇబ్బందులు పెట్టారనే విషయంపై ఆమె స్పందించారు. తాను చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్నప్పుడు ఎలాంటి అల్లరి చేశానో తనకు తెలుసని.. అయితే, ఆ సమయంలో అది కామన్‌గా అనిపించేది. కానీ, ఇప్పుడు సినిమా షూటింగ్లో చైల్డ్ ఆర్టిస్టులను దర్శకుడు హ్యాండిల్ చేస్తున్నప్పుడు చూసి, తనని కూడా అలా భరించారా అని అనుకున్నట్లుగా నివేదా తెలిపింది. ఏదేమైనా, చిన్న పిల్లల అల్లరిని భరించడం చాలా కష్టం అని తనకు అర్థమైనట్లుగా ఆమె తెలిపింది.
ఇక ‘35’ మూవీలో విశ్వ, ప్రియదర్శి, గౌతమి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందిస్తుండగా, రానా దగ్గుబాటి ప్రొడ్యూస్ చేస్తున్నారు.