ఎన్టీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించిన స్టార్ కొరియోగ్రాఫ‌ర్

ఎన్టీఆర్ పై ప్ర‌శంస‌లు కురిపించిన స్టార్ కొరియోగ్రాఫ‌ర్

Published on Jul 23, 2024 5:41 PM IST

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్ర‌స్తుతం ‘దేవ‌ర పార్ట్-1’ మూవీలో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ తెర‌కెక్కిస్తుండ‌గా, పూర్తి మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ క‌థ‌తో ఈ సినిమా రానుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, ఫియ‌ర్ సాంగ్ ఇప్ప‌టికే ప్రేక్ష‌కుల్లో సాలిడ్ అంచ‌నాలు క్రియేట్ చేశాయి.

తాజాగా ఎన్టీఆర్ పై ఓ స్టార్ కొరియోగ్రాఫ‌ర్ చేసిన కామెంట్స్ నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. బాస్కో మార్టిస్ త‌న‌దైన కొరియోగ్రఫీతో దేశవ్యాప్తంగా ప్ర‌త్యేక క్రేజ్ సాధించారు. ప‌లు బాలీవుడ్ హిట్ చిత్రాల‌కు ఆయ‌న కిర‌యోగ్ర‌ఫీ చేశారు. ఇక రీసెంట్ గా ట్రెండ్ అవుతున్న తోబా తోబా పాట‌కు కూడా ఈయ‌నే కొరియోగ్ర‌ఫీ అందించారు. కాగా, బాస్కో దేవ‌ర సినిమాలోనూ ఓ సాంగ్ ను కంపోజ్ చేశారు.

దేవ‌ర మూవీలోని ఓ పాట‌కు తాను డ్యాన్స్ కంపోజ్ చేశాన‌ని, ఇందులో క‌ష్ట‌మైన స్టెప్పులేమీ లేవ‌ని.. చాలా సింపుల్ గా ఉండే ఈ డ్యాన్స్ స్టెప్పుల్లో ఎన్టీఆర్ చేసిన స్వీట్ డ్యాన్స్ అదిరిపోతుంద‌ని ఆయ‌న అన్నారు. బాస్కో గ‌తంలో బాస్కో – సీజ‌ర్ ద్వ‌యం శ్రీ‌మంతుడు, ధృవ వంటి సినిమాల‌కు డ్యాన్స్ కంపోజ్ చేశారు. చాలా కాలం త‌రువాత బాస్కో తిరిగి టాలీవుడ్ లో కొరియోగ్ర‌ఫీ చేస్తుండ‌టం.. ఎన్టీఆర్ పై ఆయన ప్ర‌శంస‌లు కురిపించ‌డం.. ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు