మ్యా్న్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన రీసెంట్ మూవీ ‘దేవర’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కొరటాల శివ డైరెక్ట్ చేయగా, పూర్తి యాక్షన్ రివెంజ్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ వెల్లడించారు. అయితే, ఈ సినిమా నుండి తాజాగా ‘చుట్టమల్లె’ వీడియో సాంగ్‌ని మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట లిరికల్ సాంగ్‌కి సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ పాటలో ఎన్టీఆర్ డ్యాన్స్‌తో పాటు జాన్వీ అందాలను వీక్షించేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు.
ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాయి. ఇక ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్‌కి వస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.