గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఏప్రిల్ 6న ఈ చిత్ర రిలీజ్ డేట్ గ్లింప్స్‌ను రిలీజ్ చేయనుండటంతో ఇది ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక వారి ఆసక్తిని మరింత పెంచేలా చిత్ర యూనిట్ ఈ గ్లింప్స్‌ను ప్రమోట్ చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు కూడా ‘పెద్ది’ గ్లింప్స్‌పై ఇంట్రెస్టింగ్ పోస్ట్ చేశారు. రామ్ చరణ్ తనలోని ఫైర్‌తో ‘పెద్ది’ గ్లింప్స్‌ను వేరే లెవెల్‌కు తీసుకెళ్లారని.. ఇది ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 90ల కాలంలో జరిగే ఈ రా అండ్ రస్టిక్ రైడ్ కోసం ప్రేక్షకులు సిద్ధం కావాలంటూ ఈ మూవీపై ఆయన అంచనాలను అమాంతం పెంచేశారు.
ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ రగడ్ లుక్‌లో కనిపిస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేంద్రు శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. మరి పెద్ది ఫస్ట్ షాట్ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
Captured
Ram Charan breathing fire????into #Peddi in a raw unconventional 90s visual! Brace yourselves for a cinematic ride ! Glimpse out on 6th April at 11.45am@AlwaysRamCharan @BuchiBabuSana @arrahman @RathnaveluDop @@divyenndu @artkolla @NavinNooli @vriddhicinemas… pic.twitter.com/a0kbBCJmsQ— Rathnavelu ISC (@RathnaveluDop) April 5, 2025