కొత్త డైరెక్టర్ తో అను ఇమ్మానుయేల్ కొత్త సినిమా

కొత్త డైరెక్టర్ తో అను ఇమ్మానుయేల్ కొత్త సినిమా

Published on Oct 23, 2024 1:16 PM IST

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ అను ఇమ్మానుయేల్ కోసం అందరికీ తెలిసిందే. మరి తెలుగు సహా తమిళ్ లో పలు సినిమాలు చేసిన ఈ యంగ్ హీరోయిన్ మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, నాని లాంటి స్టార్స్ సరసన నటించింది. అయితే ఈమె రీసెంట్ గా కోలీవుడ్ లో “జపాన్” సినిమాలో కనిపించింది.

ఇక ఈ సినిమా తర్వాత అను ఓ ప్రాజెక్ట్ ని ఓకే చేసింది. ప్రముఖ ఛాయాగ్రాహకులు ఐ ఆండ్రు బాబు దర్శకునిగా డెబ్యూ ఇస్తున్న సినిమాతో అను వర్క్ చేయనున్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఈ సినిమాలో యువ నటుడు శివ కందుకూరి నటిస్తున్నాడట.

అయితే ఆండ్రు ఎందుకంటే ప్రేమంట, తేజ్ ఐ లవ్ యు, కందిరీగ లాంటి సినిమాలకి సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయగా ఇప్పుడు ఈ సినిమాతో దర్శకునిగా మారుతున్నారు. మరి ఆల్రెడి లండన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని మై3 ఆర్ట్స్ అలాగే బిగ్ మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే మరిన్ని వివరాలు మేకర్స్ ముందు రోజుల్లో అందించనున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు