వరుణ్‌ తో సమంత కెమిస్ట్రీ అద్భుతం అట

వరుణ్‌ తో సమంత కెమిస్ట్రీ అద్భుతం అట

Published on Oct 7, 2024 2:07 PM IST

బాలీవుడ్ స్టార్ వరుణ్‌ ధావన్‌ – సమంత జంటగా నటించిన వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌: హనీ-బన్నీ’. కాగా ఈ సిరీస్ ప్రీమియర్‌ ను లండన్‌ లో ప్రదర్శించారు. ఈ ఈవెంట్‌ లో సిటాడెల్‌ నిర్మాత మాట్లాడుతూ.. వరుణ్‌, సమంతల నటనపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. నిర్మాత గినా గార్డి మాట్లాడుతూ.. ‘ఇది సిటాడెల్‌ గ్లోబల్‌ ఈవెంట్ లాంటిది. నేను ఈ సిరీస్ ఇండియన్‌ వెర్షన్‌ను చూసి షాక్ అయ్యాను. మొదటి ఎపిసోడ్‌ను మళ్లీ మళ్లీ చూశాను. నిజంగా వరుణ్‌, సమంత తమ పాత్రల్లో జీవించారు’ అంటూ గినా గార్డి చెప్పుకొచ్చారు.

గినా గార్డి ఇంకా మాట్లాడుతూ.. ‘వరుణ్‌ ధావన్‌ – సమంత మధ్య కెమిస్ట్రీ నన్ను బాగా ఆకట్టుకుంది. వారిద్దరి మధ్య బాండింగ్ అంత అద్భుతంగా ఉంది. అలాగే, వరుణ్‌ ధావన్‌ – సమంత పాత్రల్లో ఊహించని ట్విస్ట్‌లు కూడా చాలా బాగున్నాయి. రాజ్‌ అండ్‌ డీకేలంటే నాకెంతో అభిమానం. వాళ్ల ప్రాజెక్టులన్నీ భిన్నంగా ఉంటాయి. నేను కూడా ఇందులో భాగమైనందుకు ఎంతో ఆనందంగా ఉంది’ అంటూ గినా గార్డి కామెంట్స్ చేశారు. మొత్తానికి వరుణ్‌ ధావన్‌ – సమంత మధ్య కెమిస్ట్రీ పై కామెంట్స్ చేయడంతో ఈ స్పీచ్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు