ఓటీటీ సమీక్ష: సిటాడెల్ – హనీ బన్నీ – అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

ఓటీటీ సమీక్ష: సిటాడెల్ – హనీ బన్నీ – అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు డబ్బింగ్ వెబ్ సిరీస్

Published on Nov 8, 2024 12:00 AM IST
Citadel Honey Bunny Web Series Review in Telugu

విడుదల తేదీ : నవంబర్ 07, 2024

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : సమంత రుత్ ప్రభు, వరుణ్ ధావన్, కశ్వీ మజ్ముందర్, కేకే మీనన్, సిమ్రాన్, సాఖిద్ సలీమ్, సోహం మజ్ముందర్ తదితరులు

దర్శకుడు : రాజ్ & డీకే, సీత ఆర్. మీనన్

నిర్మాతలు : సయ్యద్ జయిద్ అలీ, అలెక్ కోనిక్, రాజ్ & డీకే తదితరులు

సంగీత దర్శకుడు : సచిన్-జిగర్, అమన్ పంత్

సినిమాటోగ్రఫీ : జోహన్ హుర్లిన్ అయిడ్త్

ఎడిటర్: సుమీత్ కొటియాన్

సంబంధిత లింక్స్: ట్రైలర్

ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీ ఎట్టకేలకు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. సమంత, వరుణ్ ధావన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ అభిమానుల్లో మంచి బజ్‌ని క్రియేట్ చేసింది. మరి రాజ్ & డీకే డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతమేర మెప్పించిందో ఈ రివ్యూలో చూద్దాం.

 

కథ:
2000 సంవత్సరంలో జరిగే ఈ కథలో హనీమందాకినీ అలియాస్ హనీ(సమంత) తన గతం వల్ల ఆమె చుట్టూ ప్రమాదాలు పొంచి ఉన్నాయని గుర్తిస్తుంది. అయితే, తనకున్న ప్రధాన లక్ష్యం తన కూతురు నదియా(కశ్వీ మజ్ముందర్)ని కాపాడుకోవడం. బాబా(కేకే మీనన్) అండ్ గ్యాంగ్ హనీని వెంటాడుతోంది. ఇదే సమయంలో రాహి గంభీర్ అలియాస్ బన్నీ(వరుణ్ ధావన్) కూడా హనీని వెతుకుతుంటాడు. అసలు ఈ హనీ ఎవరు..? బాబా గ్యాంగ్ ఆమెను ఎందుకు వెంటాడుతోంది..? ఆమె కోసం బన్నీ ఎందుకు వెతుకుతున్నాడు..? వారిద్దరికీ ఎలాంటి సంబంధం ఉంది..? తన చుట్టూ ఉన్న ప్రమాదాల నుండి హనీ బయటపడుతుందా..? అనేది ఈ వెబ్ సిరీస్‌లోని ఎపిసోడ్స్ చూసి తెలుకోవాల్సిందే.

 

ప్లస్ పాయింట్స్:
‘ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2’లో తన పాత్ర ద్వారా మంచి గుర్తింపు పొందిన సమంత, ఇప్పుడు ‘సిటాడెల్’తోనూ ప్రేక్షకులకు ఆకట్టుకుంది. తన కూతుర్ని కాపాడుకోవాలనే తల్లిగా, స్పై గా ఆమె పండించిన హావభావాలు అద్భుతంగా ఉన్నాయి.

వరుణ్ ధావన్ కూడా తన పాత్రను చక్కగా పోషించాడు. సమంతతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న వరుణ్ ధావన్ ఈ వెబ్ సిరీస్‌ని మరింత ఆసక్తికరంగా, మంచి సీన్స్‌తో అలరించాడు.

ఇక ఈ సిరీస్‌లో సమంత కూతురిగా చేసిన కశ్వీ మజ్ముందర్ తన అద్భుతమైన పర్ఫార్మెన్స్‌తో ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేసింది. సమంతతో ఆమె చేసిన సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కే కే మీనన్, సాఖిద్ సలీమ్, సోహం మజ్ముందర్ తదితరులు తమ పాత్రల మేర ఆకట్టుకుంటారు. సింగిల్ షాట్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ ఈ వెబ్ సిరీస్‌కి హైలైట్‌గా నిలిచిందని చెప్పాలి. విజువల్స్ పరంగా కూడా ఇది బాగా ఆకట్టుకుంటుంది.

 

మైనస్ పాయింట్స్:
చాలా మంది నటీనటులు ఉన్నప్పటికీ ‘సిటాడెల్: హనీ బన్నీ’లో ఆసక్తికర కథ లేకపోవడం మైనస్ అని చెప్పాలి. రాజ్ & డీకే, సీతా ఆర్ మీనన్ రాసుకున్న కథ అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఎంగేజింగ్ ట్విస్టులు లేకపోవడం, డైలాగులు వీక్‌గా ఉండటం వంటివి ఈ వెబ్ సిరీస్‌కి మైనస్.

రాజ్ & డీకే నుండి అభిమానులు ఆశించే కథ మనకు ఇందులో మిస్ అయినట్లు కనిపిస్తుంది. ఈ సినిమా నెరేషన్ కూడా ఆసక్తికరంగా లేకపోవడం, కథ తరుచూ 1992, 2000 లకు మారుతుండటం కూడా ఈ సిరీస్ ఫ్లోని దెబ్బతీసింది.

ఓ స్పై థ్రిల్లర్‌గా, ‘సిటాడెల్’ వంటి పాపులర్ సిరీస్‌కి సీక్వెల్‌గా వచ్చిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ సస్పెన్స్, టెన్షన్‌ను క్రియేట్ చేయడంలో ఫెయిల్ అయ్యింది. కే కే మీనన్ పాత్రను డిజైన్ చేసిన తీరు ఏమాత్రం ఇంప్రెస్ చేయదు. సిమ్రాన్ పాత్ర కూడా కొంతమేర పర్వాలేదనిపించి, చివరకు వృథాగా మారిపోతుంది.

యాక్షన్ సీక్వె్న్స్‌లు కూడా థ్రిల్ చేయలేకపోయాయి. ఇంటర్నేషనల్ ‘సిటాడెల్’ సిరీస్‌తో పోలిస్తే, ఇండియన్ వర్షన్ బాగానే అనిపించినా, ప్రేక్షకులను థ్రిల్ చేసే అంశాలు లోపించడం గమనార్హం.

 

సాంకేతిక విభాగం:
రాజ్ & డీకే, సీత ఆర్ మీనన్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ సిరీస్‌లో యాక్షన్, థ్రిల్లింగ్ అంశాలు జోడించడంలో విఫలమయ్యారు. సినిమాటోగ్రఫర్ జోహన్ హుర్లిన్ పనితనం బాగుంది. 90ల కాలం నాటి పరిస్థితులను క్రియేట్ చేయడంలో ప్రొడక్షన్ వాల్యూస్ ఆకట్టుకున్నాయి. అయితే, సంగీతం ఆకట్టుకునే విధంగా లేదు. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త్ బెటర్‌గా ఉండాల్సింది.

 

తీర్పు:
ఓవరాల్‌గా ‘సిటాడెల్: హనీ బన్నీ’ అంచనాలను అందుకోవడంలో ఫెయిల్ అయ్యింది. సమంత, వరుణ్ ధావన్ తమ పర్ఫార్మెన్స్‌లతో ఆకట్టుకున్నా.. థ్రిల్స్, యాక్షన్, కథలోని లోతు సరైన పాళ్లలో లేకపోవడం ఈ సిరీస్‌కు డ్యామేజ్ చేశాయి. కొన్ని సీన్స్ ఆకట్టుకున్నా, గ్రిప్పింగ్ అంశాలు లేకపోవడంతో అభిమానులను నిరాశకు గురిచేస్తుంది. సమంత అభిమానులకు ఈ సిరీస్ నచ్చినా, థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి అంతగా నచ్చకపోవచ్చు.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు