పాజిటివ్ ఎనర్జీ నింపిన క్లాప్ యట్ 5పీఎం.

పాజిటివ్ ఎనర్జీ నింపిన క్లాప్ యట్ 5పీఎం.

Published on Mar 22, 2020 6:50 PM IST

కరోనా వైరస్ వ్యాప్తి ఊహకు మించిన ప్రమాదంగా మారుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నష్ట నివారణ చర్యలు మొదలుపెట్టాయి. దేశంలోని ప్రధాన రవాణా వ్యవస్థలను నిలిపివేయడం జరిగింది. అలాగే నేడు ప్రధాని నరేంద్ర మోడీ జనతా కర్ఫ్యూ పేరుతో అందరూ ఇళ్లకే పరిమితం కావాలని కోరారు. అలాగే కఠిన పరిస్థితులలో రోగులకు అండగా నిలబడి వైద్య సేవలు అందిస్తున్న సిబ్బందికి సేవలకు గురుతుగా సాయంత్రం 5 గంటలకు బాల్కనీలోకి వచ్చి చప్పట్లు కొట్టాలని కోరారు.

ఈ క్లాపింగ్ కాన్సెప్ట్ విపరీతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. సామాన్యుల నుండి సెలెబ్రిటీస్ వరకు ఈ క్లాపింగ్ పాటించారు. దేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు చెందిన హీరోలు, హీరోయిన్స్ మరియు దర్శక నిర్మాతలు 5 గంటలకు క్లాప్స్ కొట్టి, బెల్స్ మోగించి తమ వంతు బాధ్యత నెరవేర్చారు. టాలీవుడ్ నుండి చిరంజీవి, మహేష్, ఎన్టీఆర్, పవన్, చరణ్, ప్రభాస్, బన్నీ లతో పాటు అనేక మంది హీరోలు ఈ బాధ్యత నెరవేర్చారు. విపత్కర పరిస్థుతులలో ఈ క్లాపింగ్ ప్రోగ్రాం పాజిటివ్ ఎనర్జీ మరియు హోప్ ప్రజలలో నింపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు