“బాక్” సీక్వెల్ పుకార్లపై క్లారిటీ.!

“బాక్” సీక్వెల్ పుకార్లపై క్లారిటీ.!

Published on Oct 26, 2024 8:00 PM IST

ఈ ఏడాది కోలీవుడ్ సినిమా దగ్గర పెద్దగా సరైన హిట్స్ లేవు అనే సమయంలో వచ్చిన హిట్ చిత్రం “బాక్”. కోలీవుడ్ సినిమా దగ్గర హిట్ అయ్యినటువంటి హారర్ ఫ్రాంచైజ్ అరణ్మణై లో నాలుగో సినిమాగా రాశీ ఖన్నా అలాగే తమన్నా కాంబినేషన్ లో దర్శకుడు సుందర్ సి తెరకెక్కించిన ఈ సినిమా హిట్ అయ్యి కొంచెం ఊపిరి పోసింది. అయితే ఈ సినిమాకి మరో సీక్వెల్ అరణ్మణై 5వ సినిమాని స్టార్ట్ చేస్తున్నట్టుగా ఓ పోస్టర్ పెద్ద ఎత్తున వైరల్ గా మారింది.

అయితే ఈ పోస్టర్ సహా ఇతర అంశాలపై ఈ సినిమా నిర్మాత దర్శకుడు భార్య అయినటువంటి ఖుష్భు సాలిడ్ క్లారిటీ అందించారు. ఈ సినిమా సీక్వెల్ పై వస్తున్నా వార్తల్లో ఏది నిజం కాదని తేల్చేసారు. వైరల్ అవుతున్న పోస్టర్, నటీనటుల పేర్లు ఇలా అన్నీ కూడా ఫేక్ ఎవరూ నమ్మొద్దు అంటూ తెలిపింది. ఏదైనా ప్లాన్ చేస్తే మేమే డైరెక్ట్ గా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చింది. సో ఈ రెండు రోజులుగా వైరల్ అవుతున్న ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు